మన్యం న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి 28: మండల పరిధిలోని అంకం పాలెం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం జాతీయ సైన్స్ దినోత్సవం సంబరాలు ఘనంగా నిర్వహించి, విద్యార్థులకు వక్తృత్వ వ్యాసరచన, చిత్రలేఖనం, రంగోలి, సైన్స్ ఎగ్సిబిషన్ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానోపాధ్యాయుడు తోలం వెంకటేశ్వర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞాన రంగంలో విశేష కృషి చేసి రామన్ ఎపెక్ట్ కనిపెట్టి ఆసియా ఖండం తరుపున మొదటి నోబెల్ పురస్కారం 1928 ఫిబ్రవరి 28 పొందిన భారత రత్న సర్ సి వి రామన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటామని, ప్రతి విద్యార్థి శాస్త్ర విజ్ఞాన రంగంలో ఇంకా ప్రగతి సాధించి ప్రపంచ అవసరాలు తీర్చేలా కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకట రమణ, సంధ్యారాణి,కృష్ణ ప్రసాద్, రామక్రిష్ణ,వీరభద్రమ్, శ్యామల,నాగేంద్రమ్మ, శ్రీను,సురేష్,భవాని,దేవి,వాణి గోపాలరావు, లత, పుష్ప,లలిత,సునీత,భారతి,బేబీ,లక్ష్మి నర్సు తదితరులు పాల్గొన్నారు.