ఎమ్మెల్యే రేగా కృషితోనే ఏకలవ్య పాఠశాలలు మంజూరు
తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడే పాఠశాలను తీసుకోవచ్చా
మళ్లీ గెలిచాక మంజూరు చేయించింది.. నేనే
ప్రభుత్వ విప్ రేగా
మన్యం న్యూస్ గుండాల, ఫిబ్రవరి 28.. ప్రభుత్వ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మంగళవారం మండలంలో పర్యటించి ముత్తాపురం గ్రామంలో నిర్మితమవుతున్న ఏకలవ్య పాఠశాలను సందర్శించారు. గతంలో తొలిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడే ఏకలవ్య పాఠశాలను పినపాక నియోజకవర్గానికి ఏకలవ్య పాఠశాలను మంజూరు చేశానన్నారు. అప్పటి పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో ఆ పాఠశాల చింతూరుకు వెళ్లిందని అది కాస్త ఆంధ్రాలో కలవడంతో మన జిల్లాకు ఏకలవ్య పాఠశాల లేకుండా పోయిందన్నారు మళ్లీ నేను గెలిచిన తర్వాతనే ఏకలవ్య పాఠశాలను ఎంతో కృషితో సాధించామని ఆయన పేర్కొన్నారు. ఏకలవ్య పాఠశాల భవనం నిర్మాణం అవుతుందని ఇది పూర్తయితే పీజీ వరకు ఇందులోనే చదువుకునే సౌకర్యం ఉంటుందన్నారు అలాంటి అద్భుతమైన పాఠశాల గుండాల మండలానికి వచ్చినందుకు మండల ప్రజలు ఎంతో సంతోషించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు భవాని శంకర్, వట్టం రాంబాబు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి, యువజన విభాగం అధ్యక్షులు సయ్యద్ అజ్జు, బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం రమేష్ , ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు, ఎస్టీ సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు వట్టం రవి, తదితరులు పాల్గొన్నారు
