మన్యం న్యూస్ ఇల్లందు ఫిబ్రవరి 28: మామిడి గుండాల పంచాయతీలోని మేడికుంటలో మంగళవారం రోజు మేడికుంట యూత్ అధ్వర్యంలో 7 మండలాల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం అయింది. ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య హాజరయ్యారు.7 మండలాల నుంచి మొత్తం 25 జట్లు టోర్నమెంట్లో పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సర్పంచులు పాయం స్వాతి,తాటి చుక్కమ్మ,పోలెబోయిన వెంకటేశ్వర్లు,మండల రాము,తాటి రాంబాబు,పాయం కృష్ణ ప్రసాద్, రావూరి సతీష్,పాయం ఆంజనేయులు,ప్రసన్న కుమార్ యాదవ్,రాము,తదితరులు పాల్గొన్నారు.
