పలు కుటుంబాలను పరామర్శించిన రేగా
మన్యం న్యూస్ గుండాల, ఫిబ్రవరి 28 ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పలు కుటుంబాలను మంగళవారం పరామర్శించారు. సాయన పల్లి గ్రామంలో మోడం సత్యం కుమారుడు కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం జగ్గయ్య గూడెం గ్రామంలో మల్కం దివాకర్ మృతి చెందడంతో అతని కుటుంబాన్ని సైతం పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, నియోజకవర్గ నాయకులు భవాని శంకర్, వట్టం రాంబాబు, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య,టి రాము, యువజన విభాగం అధ్యక్షులు అజ్జు,నిట్ట రాములు, గడ్డం రమేష్, లక్ష్మీనారాయణ, సుధాకర్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
