పేద ప్రజలకు డబుల్ ఆనందం తెచ్చే
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ప్రభుత్వ విప్ రేగా
లబ్ధిదారులకు రెండు పడకల ఇండ్లను పంపిణీ
మన్యం న్యూస్ గుండాల, ఫిబ్రవరి 28.. పేదలకు రెండు పడకల ఇండ్లు ఇవ్వడంతో డబుల్ ఆనందం వచ్చిందని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మంగళవారం మండలంలో పర్యటించిన ఆయన రెండు పడకల గృహ సముదాయాన్ని లబ్ధిదారులకు అందజేశారు. మండలం పరిధిలోని వేపల గ్రామ సమీపంలో రెండు కోట్ల వ్యయంతో నిర్మించిన 40 ఇండ్లను లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులకు రేగా కాంతారావు అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు రెండు పడకల ఇండ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు అందులో భాగంగానే ఈ నలభైన్లను లబ్ధిదారులకు లాటరీ పద్ధతి ద్వారా అందించినట్లు ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. సొంత జాగా ఉన్న పేదలందరికీ మూడు లక్షల రూపాయలను ఇల్లు కట్టుకునేందుకు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మి ఒక గొప్ప పథకమని పెళ్లి అయిన ప్రతి ఆడపడుచుకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలను అందిస్తుందన్నారు. నిరుపేదలకు ఇల్లు ఇవ్వడం అదే రోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆడపడుచులకు అందివ్వడం ఎంతో ఆనందంగా ఉందని రేగా కాంతారావు అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నాగ దివ్య, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీపీ ముక్తి సత్యం, సర్పంచ్ సీతారాములు, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వీరస్వామి, ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
