UPDATES  

 బంజారుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్

బంజారుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్
గడ్డి గుట్ట ప్రాంతంలో అంగరంగ వైభవంగా
సంతు శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 28… బంజారుల ఆరాధ్య దైవమైన సంతు శ్రీ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి వేడుకలు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం గడ్డి గుట్ట పంచాయతీలో అత్యంత ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ బంజారా సంఘం జిల్లా అధ్యక్షులు లావుడియా ప్రసాద్ నాయక్ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు బిజెపి జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ(చిన్ని), కాంగ్రెస్ నాయకులు మాలోత్ రాందాస్ నాయక్, లక్ష్మీదేవి పల్లి ఎంపీపీ భూక్య సోనా తదితరులు పాల్గొని మాట్లాడారు. శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు హాజరైన ప్రముఖులను వేడుకల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతించి బంజరుల సాంప్రదాయాల ప్రకారం వారికి తలపాకలను అలంకరించి సేవాలాల్ మహారాజ్ పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంజరుల ఉన్నతికే జన్మించిన మహా పురుషుడు సేవలల్ మహారాజని తాను నివసిస్తున్న తండాతో పాటు అనేక తండాలలో ఆదర్శ జీవితం బంజరులు గడిపేందుకు ప్రత్యక్షమైన పోరాటం చేసిన మహినీయుడు సేవలాల్ మహారాజ్ అని కొనియాడారు. బంజరుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా జరుపుకోవడం ఎంతో శుభ పరిమాణం అన్నారు ఈ జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడంలో లావిడియా ప్రసాద్ నాయక్ చేసిన కృషి అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు ఏనుగుల అర్జున్ రావు, సేవాలాల్ బంజారా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నునావత్ రాంబాబు నాయక్, ప్రముఖ డాక్టర్లు బిందు పల్లవి, డాక్టర్ వెంకన్న, డాక్టర్ ఉషారాణి, అడ్వకేట్ రమేష్ నాయక్ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య రాంబాబు, మంగీలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !