మన్యం న్యూస్, సారపాక , ఫిబ్రవరి 28..
విద్యార్థుల్లో సృజనాత్మకత ఎంతో ముఖ్యమని దీనివల్లే దేశంలో నూతన ఆవిష్కరణలకు అవకాశం ఉంటుందని బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ బి.ఎన్.ఆర్ అన్నారు. మంగళవారం సారపాక పట్టణంలోని బ్రిలియంట్ విద్యాసంస్థల నందు జాతీయ సైన్స్ డే సందర్భంగా విద్యార్థులచే ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ బి.ఎన్.ఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం విద్యార్థుల తయారుచేయబడిన సైన్స్ ప్రాజెక్టులను ఉపాధ్యాయ, అధ్యాపక బృందం తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బి.ఎన్.ఆర్ మాట్లాడుతూ… విద్యార్థుల్లో సృజనాత్మకత ఎంతో ముఖ్యమని దీనివల్లే దేశంలో నూతన ఆవిష్కరణలకు అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులు చాలా బాగున్నాయని, భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత స్థితిలో చేరి శాస్త్ర సాంకేతిక రంగంలో దేశాన్ని మంచి స్థానంలో ఉంచాలని అన్నారు. అనంతరం పాఠశాల 10వ తరగతి విద్యార్థులు సైన్స్ విభాగం ఉపాధ్యాయులు నరేష్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వర్ణ కుమారి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు