మన్యం న్యూస్ బూర్గంపాడు ఫిబ్రవరి 28..తెలంగాణ రాష్టం ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమం మంగళవారం బూర్గంపహాడ్ మండలం మారుమూల ఏజెన్సీ ప్రాంతంలోని గల కృష్ణసాగర్ లో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ప్రారంభించారు. ఆమె ఉద్దేశించి మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నారు, ఈ కార్యక్రమం లో ఉచితంగా పరీక్షలు చేసి తగిన కళ్లద్దాలు, మరియు మందులు అందిస్తున్నారు, కంటి వెలుగు కార్యక్రమం 6 నెలలు కొనసాగుంది, కంటి పరీక్షలు చెపించుకోవలిసిన వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాటు చేయాలని పంచాయతీ సిబ్బంది కోరటం జరిగింది, కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవతం చేయటానికి అందరు కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పారు, ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ కొదిమె వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ గోవింద్ సొసైటి డైరెక్టర్ గోవర్ధన్, వార్డునెంబర్ రాజేష్, ఉపేందర్, వాడితే శ్రీను,రవి, మోష, వెంకటరత్నం, చంద్రయ్య, ఎడ్ల శ్రీను, లఘుపతి, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు
