ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం…
విద్యార్థులంతా సివి రామన్ ను ఆదర్శంగా తీసుకోవాలి…
బి వెంకటేశ్వర్లు ఈ గ్రేడ్ శాస్త్రవేత్త, హెవీ వాటర్ ప్లాంట్…
మన్యం న్యూస్ చండ్రుగొండ ఫిబ్రవరి 28 : మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ స్థాయి జాతీయ సైన్స్ దినోత్సవం మంగళవారం మండల విద్యాశాఖధికారి సత్తెనపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. కాంప్లెక్స్ స్థాయి జాతీయ సైన్స్ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా బి వెంకటేశ్వర్లు ఈ గ్రేడ్ శాస్త్రవేత్త, హెవీ వాటర్ ప్లాంట్, వచ్చి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…1928 ఫిబ్రవరి 28 రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్నందున, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారని,విద్యార్థులంతా సివి రామన్ ఆదర్శంగా తీసుకోవాలని, శాస్త్రవేత్తలుగా ఎదగాలని, వివిధ పరిశోధనలు చేసి భారతదేశానికి ఉపయోగపడాలన్నారు. మండల పరిధిలోని ప్రతి పాఠశాలలోని విద్యార్థులు వారి ప్రతిభను కనబడుచారని, సైన్స్ ప్రాజెక్ట్లు, వచ్చిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు బాగా ఆకట్టుకున్నాయని, మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ,ద్వితీయ, తృతీయ బహుమతులను, ప్రశంసా పత్రాలను, అందజేశామని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు ఉండేటి ఆనంద్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజశ్రీ,ఎండి వజీద్, ఉమారాణి, కృష్ణ,స్వరూప, రాణి, తేజావత్ శ్రీరాములు, కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్ బానోత్ సేవ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.