UPDATES  

 మంచినీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటా… -నీరు వృధాగా పోకుండా పైపులకు ట్యాప్ లు ఏర్పాటు చేసుకోవాలి.

మంచినీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటా…
-నీరు వృధాగా పోకుండా పైపులకు ట్యాప్ లు ఏర్పాటు చేసుకోవాలి.
-మాంసపు వ్యర్ధాలు రోడ్డుపై వేస్తే పది వేలు జరిమానా.
-మణుగూరు మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణ.
మన్యం న్యూస్, మణుగూరు , ఫిబ్రవరి28: మణుగూరు మున్సిపాలిటీలో మంచినీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటానని మణుగూరు మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణ అన్నారు. ఆయన మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రజలు నీటిని వృధాగా వదిలేస్తున్నారని, నీరు వృధాగా పోకుండా పైపులకు ట్యాప్ లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. చికెన్, మటన్ షాపుల యజమానులు మాంసపు వ్యర్ధాలను షాపుల ముందు రోడ్డుపై వేస్తే పది వేల రూపాయలు జరిమానా విధిస్థామన్నారు. చికెన్ షాప్, మటన్ షాపుల ముందు మాంసపు వ్యర్ధాలను వేయడం కారణంగా కుక్కలు విపరీతంగా పెరిగాయన్నారు. దీని వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మాంసపు వ్యర్ధాలను తరలించేందుకు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేస్తామన్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, రెస్టారెంట్లు తోపుడు బండ్ల యజమానులు వ్యర్ధాలను రోడ్లపై వేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మణుగూరు మున్సిపాలిటీలో సుమారు 500 కుక్కలు ఉన్నట్లు గుర్తించామని వాటిని కొత్తగూడెం ఏబిసి సెంటర్ కు తరలించి చికిత్స అనంతరం సురక్షత ప్రాంతాల్లో వదిలేస్తామని దీనికి ప్రజలు సహకరించాలన్నారు. మున్సిపాలిటీ ప్రజలు వృధా ఆహార పదార్థాలను రోడ్లపై వేయకుండా సహకరించాలని, చెత్త వ్యాన్ ను ఉపయోగించుకోవాలన్నారు. వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గోదావరి నీటిపాయను చర్ల నుండి రాయగూడెం ఇంటెక్ వెల్ వైపు మళ్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి కలెక్టర్ పంపించామన్నారు. శివలింగాపురం, బాపనగుంట తదితర ప్రాంతాల్లో అమృత్ 2.0 ద్వారా 17 కోట్లు నిధులతో నీటి సమస్య లేకుండా తీరుస్తామని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మేనేజర్ నాగరాజు, ఏఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !