UPDATES  

 వేల్పుల చిన్న వెంకన్న కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లింపునకు చర్యలు చేపట్టాలి….

వేల్పుల చిన్న వెంకన్న కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లింపునకు చర్యలు చేపట్టాలి….
మన్యం న్యూస్, మణుగూరు , ఫిబ్రవరి28: డంపర్, బొలెరో ప్రమాదంలో చనిపోయిన వేల్పుల చిన్న వెంకన్న కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లింపునకు చర్యలు చేపట్టాలని కోరుతూ
ఏరియా జిఎం దుర్గం రామచందర్ కి వెంకన్న భార్య సుజాత, కుమారుడు గణేష్ లు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ తన భర్త వేల్పుల చిన్న వెంకన్న ఓసి 2 లో జరిగిన డంపర్ బొలెరో ప్రమాదంలో చనిపోయాడన్నారు. ఈ నేపథ్యంలో తమ విజ్ఞప్తి మేరకు సింగరేణి యాజమాన్యం బొలెరో టెండర్ కొనసాగింపు తో పాటు వర్క్ మెన్ కాంపెన్ సేషన్ కు (నష్టపరిహారం) రూ.11.81 లక్షల రూపాయలకు సంబంధించి కూడా పురోగతి ఉందన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం తో పాటు జాతీయ సంఘాలతో, సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులతో ఏ ఎల్ సి సమక్షంలో హైదరాబాదులో చేసుకున్న ఒప్పందం ప్రకారం దురదృష్టవశాత్తు ఎవరైనా కాంట్రాక్ట్ కార్మికులు గని ప్రమాదంలో చనిపోతే వారి కుటుంబానికి రూ. 15 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని సింగరేణి యాజమాన్యం చేసుకొన్న వ్రాతపూర్వక ఒప్పందం ప్రకారం రు6.15 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా కంపెనీ నుంచి రావాల్సి ఉందనీ, అదేవిధంగా కార్మిక చట్టాల నిబంధనల ప్రకారం వర్క్ మెన్ కాంపన్ సెషన్ కు సంబంధించిన వడ్డీ 1.80 లక్షలు తమ కుటుంబానికి యాజమాన్యం చెల్లించాల్సి ఉందన్నారు. ఇప్పటికైనా ఎక్స్ గ్రేషియా, వర్క్ మెన్ కాంపన్ సేషన్ వడ్డీ సత్వర చెల్లింపునకు తగు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ నర్సిరెడ్డి, గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నాసర్ పాషా, ఐ ఎఫ్ టి యు ఏరియా నాయకులు అంగోత్ మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !