బాగా చదువు …బాసటగా నిలుస్తా డాక్టర్ గా పేద ప్రజలకు సేవ చేయాలి ప్రతిభ ఉన్న విద్యార్థులను ఆదుకోవడంలో ముందుంటా రేగా గిరిజన ఆణిముత్యాన్ని శాలువాతో సన్మానించిన ప్రభుత్వ విప్ రేగా మన్యం న్యూస్ గుండాల, మార్చి 01: ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు బుధవారం గుండాల మండల పర్యటనలో గిరిజన ఆణిముత్యమైన ఇర్ఫా ప్రసన్నని సాయనపల్లి గ్రామంలో శాలువాతో సన్మానించారు. సాయినపల్లి గ్రామానికి చెందిన ఇర్ఫా ప్రసన్న ఎంబిబిఎస్ సీటు సాధించటంతో బుధవారం పర్యటనలో ఆమెను సన్మానించి బాగా చదువుకో బాసటగా నిలుస్తానని హామీ ఇచ్చారు. బాగా చదివి డాక్టర్ అమ్మగా వచ్చి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కృషి చేయాలని సూచించారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఎందరో ఆణిముత్యాలు ఉన్నారని అలాంటి వారిని గుర్తించి తోడ్పాటు అందిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించి వారి ప్రాంతానికి మంచి పేరు తెస్తారని అన్నారు. ఇప్పటికే రేగా విష్ణు ట్రస్ట్ ద్వారా అనేకమంది విద్యార్థులను ఆదుకుంటున్నామని ఎంబిబిఎస్ సీటు సాధించిన విద్యార్థులను ట్రస్టు ద్వారా చదివిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ట్రస్టు ద్వారా వారికి కావలసిన పుస్తకాలను అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి వారు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే విధంగా తన వంతు తోడ్పాటును అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. రానున్న రోజులలో అనేకమంది ప్రతిభ ఉన్న విద్యార్థులను ఆదుకోవడంలో తాను ఎప్పుడూ ముందే ఉంటానని ఆయన అన్నారు.
