UPDATES  

 మైనర్ బాలికపై అత్యాచారయత్నం ? లక్ష్మీదేవిపల్లి మండలంలో సంచలనం రేపిన ఘటన

మైనర్ బాలికపై అత్యాచారయత్నం ? లక్ష్మీదేవిపల్లి మండలంలో సంచలనం రేపిన ఘటన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు ఘటనపై స్పందించిన ఐసిడిఎస్ అధికారులు మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి మార్చి01… దట్టమైన అడవి ప్రాంతంతో కప్పబడి ఉన్న ఏజెన్సీ గ్రామం అది. ఆ గ్రామంలో చదువుకుంటున్న 8 ఏళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన15 ఏళ్ల యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డ సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లక్ష్మీదేవి పల్లి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న 8 ఏళ్ల చిన్నారి మంగళవారం పాఠశాల విడిచిన తర్వాత ఇంటికి వచ్చిన ఆ చిన్నారికి మాయమాటలు చెప్పి అదే గ్రామానికి చెందిన 15 సంవత్సరాల యువకుడు తన సైకిల్ పై ఎక్కించుకొని సమీపంలోని అడవి ప్రాంతానికి తీసుకు వెళ్లినట్టు సమాచారం. ఆ బాలికను అడవి ప్రాంతాలకు తీసుకెళుతున్న యువకుడ్ని చూసి కొంతమంది గ్రామస్తులు వెంటపడి పట్టుకున్నారు. అభము శుభము తెలియని ఎనిమిది ఏళ్ల చిన్నారిని ఎక్కడికి తీసుకెళ్తున్నావని ప్రశ్నించడమే కాకుండా ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన సంచలనం రేపడంతో జరిగిన అత్యాచారయత్న ఘటనపై ఐ సి డి ఎస్ అధికారులు ఘాటుగా స్పందించారు. బాలిక తల్లిదండ్రులను కూడా తీసుకొని స్థానిక లక్ష్మీదేవి పల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చారు. జరిగిన సంఘటనపై పూర్తి వివరాలు సేకరించడంమే కాకుండా సంబంధిత యువకుడు పై కేసు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే యువకుడు, ఆ చిన్నారి ఇద్దరు మైనర్లు కావడంతో పోలీసులతో పాటు ఐసిడిఎస్ అధికారులు కూడా తలలు పట్టుకున్నారు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులు అనుమతితో గోప్యంగా ఉంచుతారా..? లేక ఆ యువకుడు పై చర్యలు తీసుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. జరిగిన సంఘటనపై మాత్రం గ్రామంలో ఉన్న కొందరు పెద్ద మనుషులు రాజి కుదిరిచ్చేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం ఈ ఘటనపై ఎవరు ఏ మేరకు ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సిందే.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !