మన్యం న్యూస్ ఇల్లందు, మార్చి01.. ఇల్లందు మున్సిపాలిటీలోనీ 1,2 వార్డులలో బుధవారం రోజు కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ రవి అధ్వర్యంలో హత్సేహాత్ జొడో పాదయాత్ర సాగింది.వారు వార్డులోని ఇంటింటికీ వెళ్లి కలుస్తూ స్థానిక సమస్యలు తెలుసుకున్నారు.వార్డులో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ప్రజలతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.ఐదు వందలకే గ్యాస్ , మహిళలకు పావలా వడ్డీకే రుణాలు, సొంతింటి కళకు ఐదు లక్షలు ఇస్తామని చెప్పుకొచ్చారు. పాదయాత్రలో కాంగ్రెస్ నాయకులు జివి భద్రం,వాసుదేవ్, ఇశ్వర్ గౌడ్, లింగంపల్లి శ్రీను, జ్యోతి, చెంచమ్మ, వందన ,రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.
