మన్యం న్యూస్, మంగపేట, మార్చి 01.. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అగ్రి గోల్డ్ బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరుతూ ఈనెల 3వ తేదీన హైదరాబాద్ లో తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో హైద రాబాద్ ఇందిరా పార్క్ (ధర్నా చౌక్) నిర్వహించే ధర్నాను జయప్రదం చే యాలని ములుగు జిల్లా మంగపేట మండలం రాజు పేట అగ్రిగోల్డ్ బాధితుల బుధవారం ఒక ప్రకటనలో కోరారు.ఈ సందర్బంగా తెలంగాణ అగ్రి గోల్డ్ బాధితుల కోడం ప్రభావతి, జలసూత్రం వెంకట నర్సమ్మ,ఎర్రం సుమతి, రానిమేకల నరసింహరావు, మునగాల శ్రీను, దోసపల్లి రామాంజనేయులు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంలో ఉన్న అగ్రిగోల్డ్ సంస్థలకు చెందిన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రాష్ట్రంలో ఉన్న అగ్రిగోల్డ్ బాధితుల అందరికీ డబ్బులు చెల్లించి న్యాయం చే యాలని డిమాండ్ చేస్తూ గురువారం జరిగే అగ్రిగోల్డ్ బాధితుల ధర్నాలో అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు పాల్గొంటారని తెలిపారు.సిపిఐ,సిపిఐ (ఎం), కాంగ్రెస్,టిడిపి, బి.ఎస్.పి,సిపిఐ ఎం ఎల్ (ప్రజాపంథా) తదితర అఖిలపక్ష పార్టీల రాష్ట్ర నాయ కులు ధర్నాకు సంఘీ భావం తెలిపేందుకు వస్తారని అన్నారు.ఈ ధర్నాకు అగ్రిగోల్డ్ కస్టమర్లు,ఏజెంట్లు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నాను జయప్రదం చేయాలని కోరారు.
