మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి మార్చి 01: మండల కేంద్రంలో పని చేస్తూన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా ఇండ్ల స్థలాలు,పక్కా గృహ నిర్మాణాలు మంజూరు చేయాలని అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావును తన స్వగృహమైన తాటి సుబ్బన్నగూడెంలో మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ తరపున వినతీ అందజేశారు.దానికీ ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ అర్హులైన అందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల జర్నలిస్టుల సంఘం నాయకులు ఆకుల శివ,కుంజా వెంకటేష్,కోర్సా శ్రీరామ్,కూరంసురేష్,వీరరాఘవులు,వెంకటరెడ్డి,వెంకటేశ్వర్లు,పాపారావు తదితరులు పాల్గొన్నారు.
