మణుగూరు ఏరియా జిఎం దుర్గం రామచందర్. మన్యం న్యూస్, మణుగూరు, మార్చి 01: సింగరేణి సంస్థ మణుగూరు ఏరియాలో 108 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందని మణుగూరు ఏరియా జిఎం దుర్గం రామచందర్ అన్నారు. ఆయన బుధవారం స్థానిక జీఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫిబ్రవరి నెలలో ఏరియాకు తొమ్మిది లక్షల 9,95,810 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 9,10, 442 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో ఇచ్చిన లక్ష్యాన్ని కంటే అధిక లక్ష్యాన్ని సాధించే దిశగా కష్టపడి పని చేయాలన్నారు. అన్ని ఏరియాలకంటే మణుగూరు ఏరియాలో ఉత్పత్తి అధికంగా ఉందన్నారు. అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు కృషిచేసిన అధికారులు కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో ఏరియా ఎస్వోటు జి ఎం లలిత్ కుమార్, పర్సనల్ మేనేజర్ రమేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
