మన్యం న్యూస్, పినపాక, మార్చి 01… మండల పరిధిలోని ఏడూళ్ళ బయ్యారం పంచాయితీ కార్యాలయ సెంటర్ లో సీసీ రోడ్డు పనులకు పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ బుధవారం శంకుస్థాపన చేశారు. మారుమూల గ్రామాలకు సైతం రహదారులు ఉండాలనే ఉద్దేశ్యంతో, నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషితో రహదారుల నిర్మాణాలు పూర్తవుతున్నాయని ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
