మన్యం న్యూస్ చండ్రుగొండ, మార్చి01: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమంతో అంధత్వ నివారణ చేయటం జరుగుతుందని, పేదలకు వరం లాంటిదని, పంచాయతీ సర్పంచ్ పూసం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం బెండాలపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన కంటివెలుగు కేంద్రాన్ని ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కంటివెలుగు కార్యక్రమం ముఖ్యమంత్రి. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం జరిగిందని, ఈ పథకాన్ని ప్రతి యొక్కరు. సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాల్లో 18 ఏండ్లు నిండిన ప్రతి యొక్కరు ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటీసీ బొర్రా లలిత, బిఆర్ఎస్ జిల్లా నాయకులు మేడా మోహన్ రావు, కంటి వైద్యులు రఘునందన్ సాయి, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్ రాజేశ్వరి, నాయకులు లక్ష్మణ్, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.
