మన్యం న్యూస్ అన్నపురెడ్డిపల్లి మార్చి 01: మండల పరిధిలోని పెద్దిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ కి అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు అభివృద్ధి కొరకు రూ.10 లక్షల రూపాయల నిధులను సిసి రోడ్లు నిర్మాణం కొరకు కేటాయించగా వాటిని బుధవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.అనంతరం మండల అభివృద్ధి కొరకు నిరంతరం నిధులను మంజూరు చేస్తున్న ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,పోలకంపల్లిశ్రీనివాసరావు,రహీం,అమీద్,సన్నేపల్లి కృష్ణారావు,మామిల్లపల్లి సుదీర్ తదితరులు పాల్గొన్నారు.
