మన్యం న్యూస్ గుండాల, మార్చి01… కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకు వచ్చిన లేబర్ కోడ్ లను ఉపసంహరించుకోవాలని గుండాల ఎంపీపీ ముక్తి సత్యం డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఐ ఎఫ్ టి యు ద్వితీయ మహాసభను నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మతోన్మాద విధానాలను అవలంబిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అక్రమంగా తీసుకువచ్చిన చట్టాలను పోరాటాలతోనే రద్దు చేయించగలిగామన్నారు. 44 కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా కుదించి కార్మికుల హక్కులను కాలరాస్తుందని దేశంలోని కార్పోరేట్ శక్తులకు ప్రభుత్వం అమ్ముతుందన్నారు. అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు కనీస వేతనం అమలు చేయడంలో విఫలమైందన్నారు. మొండి వైఖరి మానుకోకపోతే ఉద్యమాలు చేయక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోడేటి నాగేశ్వరరావు, కొక్కు సారంగపాణి, గడ్డం లాలయ్య, వై వెంకన్న, పి వై ఎల్ జిల్లా కార్యదర్శి పరిషక రవి, శ్రవణ్, కవిత, రవి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు .
