మన్యం న్యూస్ బూర్గంపాడు మార్చి01.. ఆడబిడ్డలకు అండగా నిలిచేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని ఆపద్బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో మహిళలకు అన్ని రకాలుగా రక్షణ కల్పించే ధ్యేయంగా పనిచేస్తున్నారని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. బుధవారం మండలం లోని ఇరవెండి గ్రామంలో సుమారు 70 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు, సుమారు 70 లక్షలకు పైగా లక్షల రూపాయల విలువగల చెక్కులను ఆయనతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి , షాది ముబారక్ పథకం దేశానికి ఆదర్శం అని, మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని అన్నారు. కళ్యాణ లక్ష్మీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అని అన్నారు. కళ్యాణ లక్ష్మి పథకంతో పెదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00,116/- రూపాయల ఆర్దిక సహాయం అందిస్తుందని అన్నారు. ఆడబిడ్డలకు అండగా నిలిచేది సీఎం కేసీఆర్ మాత్రమే అని ఆయన గుర్తు చేశారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది అని అన్నారు, రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మహిళల కోసం ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుని మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని సూచించారు. మహిళల రక్షణ కోసము షి టీమ్స్, గర్బినిలు, చిన్నారుల ఆరోగ్య కోసము ఆరోగ్య లక్ష్మి పథకం, బాలింతల చిన్నారుల కోసము కేసిఆర్ కీట్స్ లాంటి పథకాలను ప్రవేశ పెట్టారు అని గుర్తు చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని తెలిపారు.
