ఇంటింటికి తెలుగుదేశం
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన టిడిపి నాయకులు..
విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపు..
మన్యం న్యూస్,జూలూరుపాడు, మార్చి 01, ఇంటింటికి తెలుగుదేశం”పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం మండల కేంద్రంలో టిడిపి నాయకులు రోకటి రంగారావు, తుమ్మలపల్లి వెంకటేశ్వరరావు, అరెం రామయ్య లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వర్గీయ ఎన్.టి.రామారావు పార్టీని స్థాపించి అతి తక్కువ సమయంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, అన్ని రంగాల అభివృద్ధితోపాటు, ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, జన రంజక పాలన అందించిన ఘనత ఎన్టీఆర్ కె దక్కిందన్నారు. నేటి కేసిఆర్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో కాలం ఎల్లదీస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందన్నారు. మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణను, అప్పుల ఊబిలో ముంచిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. కాబట్టి ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో పాల్గొని విజయవంతం చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డే వెంకటనారాయణ, లాకావత్ చిన్న, చలమల గోవిందు, నిమ్మటూరి నాగేశ్వరరావు, బానోతు భాగ్య, చలమల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు