మన్యం న్యూస్ నూగుర్ వెంకటాపురం. మార్చి 01..
వెంకటాపురం మండలం లక్ష్మీనగరం గ్రామంలో ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న ఆర్ అండ్ బి రోడ్లు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి.
నిత్యం బడి పిల్లలతో వ్యవసాయ కూలీలతో గజిబిజిగా ఉండే రోడ్లు పూర్తిగా పాడై రాకపోకలకు తీవ్ర అంతరాయంగా మారాయి. పిల్లలు బడికి పోవాలంటే ఆ రోడ్డుమీద వెళ్లే పరిస్థితి లేకుండా అనేక ఇబ్బందులకు గురిచేస్తుంది
ఈ నేపద్యంలో గ్రామస్తులు ఆ రోడ్లమీద పడే బాధలు చెబుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీనగరం అనే ఊరు మండలం నుంచి దూర ప్రాంతంగా ఉండడంతో ఏ అధికారులు పట్టించుకునే నాధుడే కరువయ్యారని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు నేటి బాలలే రేపటి పౌరులు అని ఆర్భాటంగా చెప్పే మాటలకు అదే రోడ్డు మీద బడికికూడ పోలేని పరిస్థితికి ఏం సమాధానం చెప్తారని ప్రజలు ప్రభుత్వాన్ని రోడ్డు భవన నిర్మాణ శాఖ వారిని ప్రశ్నిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు రోడ్లమీద వెళ్లాలంటే ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని వెళ్లవలసిన పరిస్థితి వస్తుందని. ప్రభుత్వం ఈ రోడ్లని పట్టించుకోనే పరిస్థితి లేదని ఏదో ఒక స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తాయని నిర్లక్ష్యం ధోరణి కనబర చు తున్నట్టు ప్రజలు వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యం ధోరణి విడిచి ఈ రోడ్లని బాగు చేసి పిల్లలకు వారి భవిష్యత్తుకు బాటలను వేయాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.
