మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి మార్చి 03… మిత్రమా ఆరోగ్యం ఎలా ఉంది.. ఇలాంటి ఇబ్బందులు ఎదురైనా మేమున్నామంటూ టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కల్లోజి శ్రీనివాస్ మహమ్మద్ షఫీ లు అభయం ఇచ్చారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో పాత్రికేయుడిగా పని చేస్తున్న పులిపాక శేఖర్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వచ్చిన ఆయనను పరమర్శించారు. అతని ఆరోగ్యం పట్ల విషయాలను అడిగి తెలుసుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో పాత్రికేయుల సంక్షేమం కోసం కట్టుబడి పని చేస్తున్నామని, ఆపద కాలంలో యూనియన్లకు అతీతంగా కృషి చేస్తున్నామన్నారు. ఇటీవల కాలంలో తమ యూనియన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పాత్రికేయులం దరికీ ఆరోగ్యపరీక్షలను నిర్వహించమని ప్రతి ఒక్కరు సహకరించారని అన్నారు. పాత్రికేయ వృత్తిలో ఎప్పుడూ నిమగ్నమై పనిచేస్తున్న వారు వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని, సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటే వారు వారి కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉంటాయని తెలిపారు. శేఖర్ ను పరామర్శించిన వారిలో పాత్రికేయులు సీమకుర్తి రామకృష్ణ, శివకుమార్, ఖాసిం, వెంకన్న, మోదుగు ప్రభాకర్, షఫీ తదితరులు పాల్గొన్నారు.
