మన్యం న్యూస్ కరకగూడెం, మార్చి 02 .. సింగరేణి జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ ను గురువారం నేతకాని కుల సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిఎం రామచంద్ర మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరు ఉన్నత స్థానంలో ఎదగాలంటే పిల్లలను బాధ్యతగా చదివించి బంగారు భవిష్యత్తుకు తోడ్పడాలి ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు చదువుకునే విద్యార్థులను గ్రామాలలో ఉంచవద్దని వారిని హాస్టల్లో చేరిపించి మంచి విద్యను అందించే విధంగా ప్రతి తల్లిదండ్రి బాధ్యత వహించాలని లేని తరుణంలో వారి భవిష్యత్తు ప్రణాళిక ఇబ్బందిగా ఉంటుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యార్థి ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్ ,రాష్ట్ర నాయకులు జాడి నాగరాజు, గుమాస శంకర్, చప్పిడి వెంకటేశ్వర్లు, కొండ గొర్ల కోటేశ్వరరావు గుమాస వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
