కోయ ఆదివాసి ప్రాచీన వంటకాలను వెలుగులోకి తీసుకురావాలి. *ఆధార్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తోలెం రమేష్, సర్పంచ్ ఇర్ప విజయ్ కుమార్ మన్యం న్యూస్ కరకగూడెం, మార్చి 02… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో ఆధార్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కోయ ఆదివాసి ఆహార సంప్రదాయాలపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో మన పూర్వీకుల తీసుకునే ఆహారం ఇప్పుడున్న మనం తినే ఆహారంపై అవగాహన సదస్సు నిర్వహించి వంటలను తయారుచేసి వాటి గురించి వివరించడం జరిగిందని తెలిపారు. అలాగే ఈ వంటలు మరల మనం తినడం వలన వివిధ రకాల రోగాలను నివారించవచ్చని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆధార్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు బట్టా.బిక్షపతి, ఇర్ప.వెంకటేశ్వర్లు, గ్రామపంచాయతి సెక్రటరీ శ్రీనాద్,ప్రధానోపాధ్యాయులు ఇర్ప క్రిష్ణయ్య గ్రామస్తులు సూతరి. నాగేశ్వరరావు, ఇర్ప. రవికుమార్, గుడ్ల.రంజీత్ కుమార్,ఇర్ప.క్రిష్ణ,సూరబాక.రామారావు, మోడెం.సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు





