UPDATES  

 ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకొని వాటిని అధిగమించాలి

ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకొని వాటిని అధిగమించాలి – మాజీ తానా అధ్యక్షులు తాళ్లూరి జయ శేఖర్ – భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 50 బెంచీల వితరణ మన్యం న్యూస్, భద్రాచలం , మార్చి 02 విద్యార్థులు చక్కని ప్రణాళికతో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని అధిగమించే విధంగా రాణించాలని మాజీ తానా అధ్యక్షులు తాళ్లూరు జయ శేఖర్ అన్నారు. గురువారం భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తాళ్లూరు భారతీదేవి జ్ఞాపకార్ధంగా విద్యార్థుల సౌకర్యార్థం అందజేసిన 50 సిమెంట్ బల్లలను తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాళ్లూరు పంచాక్షరయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ తిప్పన సిద్ధులు తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కళాశాలలోని విద్యార్థులతో ఏర్పాటు చసిన సమావేశంలో తానా మాజీ అధ్యక్షులు తాళ్లూరి జయశంకర్ మాట్లాడుతూ… విద్యార్థులు తమకు ఉన్న సౌకర్యాలను వినియోగించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. చక్కని ప్రణాళికతో ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకొని వాటిని అధిగమించే దిశగా కృషి చేయాలని ఆయన కోరారు. అనంతరం విద్యార్థుల సౌకర్యార్థం కళాశాలకు 50 సిమెంట్ బల్లాలను అందజేసిన తాళ్లూరి ట్రస్ట్ చైర్మన్ పంచాక్షరయ్యకు, తానా మాజీ అధ్యక్షులు తాళ్లూరి జయశంకర్ కు కళాశాల ప్రధానాచార్యులు డి.భద్రయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిడిసి మెంబర్ బూసి రెడ్డి శంకర్ రెడ్డి, బూర్గంపాడు పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీ, ఉప ప్రధానాచార్యులు నరేందర్ రెడ్డి, అకాడమిక్ కోఆర్డినేటర్ వేముల కామేశ్వరరావు, ప్రముఖ కవి చిగురుమల్ల శ్రీనివాస్, అడుసుమిల్ల జగదీష్, సిహెచ్ శ్రీనివాస్, చావ లక్ష్మీనారాయణ, దేశప్ప, కళాశాల అధ్యాపకులు శ్యాం ప్రసాద్ రెడ్డి, వీరన్న, జయ కిరణ్ రాంబాబు, తదితర అధ్యాపక బృందం, కళాశాల సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !