UPDATES  

 ఆదివాసీ సంప్రదాయాల బద్దంగా నిర్వహించే ఆదివాసీ దేవాలయా లను అభివృద్ధి

మన్యం న్యూస్, మంగపేట, మార్చి 02
ఆదివాసీ సంప్రదాయాల బద్దంగా నిర్వహించే ఆదివాసీ దేవాలయా లను అభివృద్ధి చేయాలని బట్టా మురళీకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.గురు వారం మంగపేట మండలంలోని లక్మి నర్సాపురం నాగులమ్మ దేవాలయాన్ని దర్శించిన గంగ పుత్ర సంఘం కన్వీనర్ బట్ట మురళి మాట్లాడుతూ ఆదివాసీలు అంటే ప్రకృతి తో మమేకం అయి జీవిస్తున్న మూలవాసులు,ఆదివాసీల సంస్కృతి ఎంతో గొప్పదని ఆదివాసీల ఆధ్వర్యంలో నిర్వహించే జాతరలను ప్రభుత్వాలే నిధులు కేటాయించి జరిపించాలని, దేవాలయాల అభివృద్ది ఆవశ్యకత వుంది, ఆదివాసీల సంస్కృతి అంతరించి పోకుండా ఆదివాసీ నిర్వహించే దేవాలయాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని ఈ సందర్బంగా తెలియజేశారు. ఈ సందర్బంగా శ్రీ నాగులమ్మ ఆలయ ప్రధాన పూజారి బాడిశ రామ కృష్ణ,శ్రీ రామకృష్ణ స్వచ్చంధ సేవా ట్రస్ట్ అధ్యక్షుడు బాడిశ నాగరమేష్ లను బట్టా మురళి క్రిష్ణను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్య క్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు మంచర్ల నాగేశ్వర్ రావు, నాయకులు,మాటూరి ఏడుకొండలు గుండారపు రమేష్,పోనగంటి నాగేశ్వర్ రావు,ఇందారపు రమేష్,మాటూరి రమేష్,బెగా రాజు, పోనగంటి రాంబాబు, బట్టా సందీప్,మునిగల మహేష్,ఓదెలా సుదీర్, మంచర్ల మనోజ్,తదితరులు పాల్గొన్నారు .

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !