మన్యం న్యూస్ గుండాల, మార్చి 02.. గుండాల మండలం పరిధిలోని వేపల గడ్డ గ్రామ సమీపంలో అరెం వంశీల ఇలవేల్పు అయిన పగటిద్దరాజు జాతర ఘనంగా ప్రారంభమైంది. బుధవారం, గురువారం, శుక్రవారం జాతర ఘనంగా జరుగుతుంది. గురువారం పగటిద్దరాజును వనము నుండి గద్దెలపైకి తీసుకువచ్చి ప్రతిష్టించారు. ప్రతి సంవత్సరం పగరెడ్డ రాజు జాతరను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఎదురుకోల్ల మహోత్సవంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని గద్దెల మీదకి ఆహ్వానించారు. సమ్మక్క పగటిద్ద రాజు రెండు రోజులపాటు ప్రజలకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆరెం వంశీయులు వంశీయులతోపాటు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు





