UPDATES  

 మన్యం కథనం అక్షర సత్యం

మన్యం కథనం అక్షర సత్యం
-సినిమా ఫక్కీలో గంజాయి తరలింపుకు యత్నం
-సుమారు 196 కిలోల గంజాయిని పట్టుకున్న పోలీసులు

మన్యం న్యూస్, సారపాక / భద్రాచలం మార్చి 02

ఏజెన్సీలో జరుగుతున్న గంజాయి అక్రమ వ్యాపారం పై మన్యం న్యూస్ పక్క సమాచార సేకరణతో ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం ప్రతినిధులతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, గుండాల మన్యం న్యూస్ విలేకరులు వార్తలు ప్రచురించడం జరిగింది. ఆనాటి నుండి అప్రమత్తమైన ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసులు కోట్లాది రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం బూర్గంపాడు మండలంలో సినిమా పక్కిలో భారీగా గంజాయి తరలించేందుకు స్మగ్లర్లు వేసిన ఎత్తులను బూర్గంపాడు పోలీసులు నిర్వీర్యం చేశారు. పుష్ప సినిమా తరహాలో ఐచర్ వ్యానులో తరలిస్తున్న సుమారు 196 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నాగరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… శుక్రవారం సారపాక పట్టణంలోని బిపిఎల్ స్కూల్ ప్రాంతంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా భద్రాచలం వైపు నుండి అత్యంత వేగంగా వస్తున్న ఐచర్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో గంజాయి తరలిస్తున్నట్లుగా గుర్తించారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా వారు మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన ఫరూక్ అల్తాఫ్, షేక్ ఖలీల్ లు గా వెళ్లడైంది. గంజాయి తరలిస్తున్న ఐచర్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో ఆ వాహనంలోని ఛాంబర్ లో ఒక డబ్బాను సీక్రెట్ గా ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ డబ్బా ని తెరచి చూడగా అందులో 10 ప్లాస్టిక్ సంచుల్లో గంజాయి ఉన్నట్లుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ గంజాయిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అరకు ప్రాంతం నుండి మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అరకు అటవీ ప్రాంతంలోని గురు అనే వ్యక్తి నుండి మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన ఆజాద్ అనే వ్యక్తికి అప్పగించేందుకు సదరు స్మగ్లర్లు తీసుకువెళుతున్నట్లుగా విచారణలో తేలిందని వారు పేర్కొన్నారు. మొత్తం పది బస్తాల్లోని 96 ప్యాకెట్లు గంజాయి పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు 39 లక్షల 37 వేల రూపాయల వరకు ఉంటుందని వారు తెలిపారు. వాహనాన్ని, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు. ఈ సమావేశంలో బూర్గంపాడు ఎస్ఐ పి సంతోష్ కుమార్, అదనపు ఎస్ఐ శ్రీను నాయక్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !