మన్యం న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 02.. మండలం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు గురువారం కళాశాల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థిని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పాఠశాలను, కాలేజీలను, అలాగే గురుకులాలను అత్యధిక నిధులు మంజూరు చేస్తూ నాణ్యమైన విద్యను అందించే దిశలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చర్యలు తీసుకుంటున్నారని, అలాగే అశ్వారావుపేట నియోజక వర్గంలో జూనియర్ కళాశాల తో పాటు డిగ్రీ కళాశాల ఎర్పాటు కు కూడా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు ప్రయత్నిస్తున్నారని, తప్పకుండా అతి త్వరలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేపిస్తారని తెలిపారు. అదే విధంగా కళాశాలలో ఉన్నా సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెల్లి పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులు, చదువుని కష్టంగా కాకుండా ఇష్టంగా చదివి మీ తల్లితండ్రులకు, కళాశాలకు, ఉపాధ్యాయులకు, అశ్వారావుపేట మండలానికి మంచి పేరు తేవాలని, మంచి మార్కులు సాధించి, ఉన్నత స్థాయికి చేరాలని అయన కోరారు. అలాగే కలశాల నందు విద్యార్థులకు, ఆర్ఓ వాటర్ ప్లాంట్ మరమ్మతులకు గురై తగు నీటికి ఇబ్బందీ పడుతున్నరాని తెలియజేయగా వెంటనే స్పందించిన ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి ఆర్ఓ వాటర్ ప్లాంట్ పునరుద్దరణ కొరకు రూ. 5000 వేలు నగదును కళాశాల ప్రిన్సిపాల్ సాగర్ కి అందజేశారు. అలాగే కళాశాలకు సాయత్రం సమయంలో విద్యార్థులకు స్నాక్స్ అందజేస్తున్న వాసవి క్లబ్ ప్రెసిడెంట్ సుబ్బారావుని అభినందించారు. . ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథిలను శాలువాతో సత్కరించిన కళాశాల సిబ్బంది. అదే విధంగా అశ్వారావుపేట సీనియర్ నాయకులు డికెఎం మహిపాల్ కళాశాల యాజమాన్యానికి కళాశాల పేరున అకౌంట్ ఓపెన్ చేసి 2 లక్షల రూపాయలను డిపాజిట్ చేసి వాటితో వచ్చె ఇంట్రస్ట్ తో ప్రతి సంవత్సరం పరీక్షలలో అధిక ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాక బహుమతి కిందా 9 మంది విద్యార్థులకు ఒక్కొకరికి 1500 వందల చొప్పున నగదు అందజేయటం జరుగుతుందని దానిలో భాగంగానే ఈ రోజు కూడా వచ్చిన అతిధుల చేతుల మీదుగా మొదటి స్థానం సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు మండల నాయకులు మందపాటి మోహన్ రెడ్డి, యూఎస్ ప్రకాష్ రావు, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ సీమకుర్తి సుబ్బారావు, కళాశాల ప్రిన్సిపాల్ సాగర్, అశ్వారావుపేట హై స్కూల్ ప్రిన్సిపాల్ నరసింహ రావు, రాంబాబు మరియు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.





