హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) ఆధ్వర్యంలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీ(డీఆర్‌డీఎల్).. జేఆర్‌ఎఫ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- మొత్తం ఖాళీల సంఖ్య: 10
- విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికిల్/ఏరోస్పేస్ ఇంజనీరింగ్.
- జేఆర్‌ఎఫ్ (మెకానికల్ ఇంజనీరింగ్): సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఎంఈ /ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. గేట్ అర్హత సాధించాలి.
- జేఆర్‌ఎఫ్ (ఏరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజనీరింగ్): సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. గేట్ అర్హత సాధించాలి.
- వయసు: 28 ఏళ్లు మించకూడదు. స్టైపెండ్: నెలకు రూ.31,000 వరకు చెల్లిస్తారు.
- రీసెర్చ్ కాలవ్యవధి: రెండేళ్లు.
- ఎంపిక విధానం: గ్రాడ్యుయేషన్‌లో మార్కులు, గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీ (డీఆర్‌డీఎల్), ఏపీజే.అబ్దుల్‌కలాం, మిసైల్ కాంప్లెక్స్, కంచన్‌బాగ్ పీవో, హైదరాబాద్–500058 చిరునామాకు పంపించాలి.
- ఇంటర్వ్యూ వేదిక: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీ(డీఆర్‌డీఎల్), ఏపీజే.అబ్దుల్‌కలాం, మిసైల్ కాంప్లెక్స్, కంచన్‌బాగ్ పీవో, హైదరాబాద్–500058.
దరఖాస్తులకు చివరి తేది: 14.06.2021
- వెబ్‌సైట్: www.drdo.gov.in