మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మార్చి 14 : ఈనెల 15వ తేదీ నుంచి జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని పరీక్ష కేంద్రాల్లో మాప్ కాఫీ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఇంటర్మీడియట్ విద్యార్థి శాఖ అధికారి సులోచన స్పష్టం చేశారు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులు 10363 ద్వితీయ సంవత్సరపు విద్యార్థులు 9504 మంది పరీక్ష రాస్తున్నట్టు తెలిపారు. ఎందుకుగాను 520 మంది యూజ్లెటర్లు ఏర్పాటు చేశామని ప్రధానంగా 35 మంది చీఫ్ సూపర్డెంట్ లను, సెట్టింగ్స్ స్క్వాడ్3, కస్టోడియన్స్ 5 జిల్లాలోని పరీక్ష కేంద్రాల వద్ద 70 మంది ఏఎన్ఎంలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు నిమిషం ఆలస్యం అయినా అనుమతించబడదని నిబంధనలను కూడా అమలులో ఉన్నట్లు తెలిపారు విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి హాజరుకావాలని తల్లిదండ్రులు కూడా బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. వేసవి కాలనీ దృష్టిలో పెట్టుకొని ప్రతి పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా తాగునీరు విద్యుత్తు తదితర మౌలిక సదుపాయాలు కూడా కల్పించామన్నారు.





