మన్యం న్యూస్ ,ఇల్లందు టౌన్:తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్మీడియేట్ ప్రథమ సంవత్సర పరీక్షలు జరగనున్నా ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలకు ఇల్లందు నియోజక వర్గం నుంచి హాజరుకానున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఇల్లందు నియోజకవర్గ శాసన సభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. ఇంటర్మీడియట్ పరీక్షలకి సకాలంలో హాజరు కావాలన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా హాలులోకి అనుమతించరని కావున ఈ విషయాన్ని విద్యార్థులందరూ దృష్టిలో ఉంచుకొని కాస్త ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఏ కంగారు పడకుండా చక్కని మేధస్సుతో పరీక్షలను రాసి మంచి మార్కులను సాధించి తల్లిదండ్రులకు, ఇల్లందు నియోజకవర్గానికి మంచి గుర్తింపు తీసుకురావాలన్నారు. మంచి ఉత్తీర్ణత సాధించడంతో పాటు తమ ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని పరీక్షలకు హాజరయ్యే ఇంటర్మీడియట్ విద్యార్థిని, విద్యార్థులను ఇల్లందు ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ కోరారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి ఆటంకాలు ఎదురవకుండా అన్ని రకాల చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ ఈ సందర్భంగా తెలియజేశారు





