మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి మార్చి 14… ఎంత కష్టతరమైన ఇష్టంగా భావించి తెగువ తెగింపు తెలంగాణ బిడ్డలకు ఎక్కువగానే ఉందని జరగబోయే ఇంటర్ పరీక్ష ఫలితాలలో మనోధైర్యంతో మంచి ఫలితాలను సాధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విద్యార్థులు మంచి పేరు తేవడం తధ్యమని పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆకాంక్షించారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆయన ఆల్ ది బెస్ట్ తెలిపారు. కనిపించిన తల్లిదండ్రుల కలలను నిజం చేస్తూ విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుల శ్రమకు తగ్గట్టుగా ఫలితాలను తీసుకువస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్యాతిని తెలంగాణ రాష్ట్రంలోని నెంబర్ వన్ గా నిలవాలని ఆయన అన్నారు. పరీక్షల సమయంలో మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతత వాతావరణంలో పరీక్షలు రాస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా విద్యార్థులు దృఢ సంకల్పంతో పరీక్షలు రాస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్నో సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా తెలంగాణ బిడ్డలు జాతి గౌరవాన్ని కాపాడమేకాకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్నో ప్రణాళికలను రూపొందించారు అన్నారు. భద్రాద్రి జిల్లాలో పరీక్ష కేంద్రాలను ఆయా శాఖల అధికారులు పరిశీలించడమే కాకుండా విద్యార్థులకు మనోధైర్యాన్ని కలిపిస్తూ ఏలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా శాఖలకు ముందస్తుగానే జిల్లా కలెక్టర్ అనుదీప్ సూచనలు ఇవ్వడం సంబంధిత అధికారులు పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి ఫలితాలను సాధించి విద్యార్థులు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దేశానికి చాటి చెప్పాలని ఆకాంక్షించారు.





