పారిశుధ్య కార్మికుల జీతాలు సక్రమంగా ఇవ్వాలి*
పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచాలి*
లోడే శ్రీనివాస్
మన్యం న్యూస్, మంగపేట, మార్చి 14
ములుగు జిల్లా మంగపేట మండల పరిధిలో ఉన్న 25 గ్రామపంచాయతీలలో పనిచేసే సిబ్బంది యొక్క సమస్యలు వర్ణనతీతం.ఆయా గ్రామపంచాయతీల వర్కర్స్ కు జీతాలు చాలాకాలంగా చెల్లించకపోవడం వలన సిబ్బంది, వారి కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పనిచేసిన సిబ్బందికి జీతాలు సక్రమంగా రాక కుటుంబాలను సాకలేక మనోధైర్యం కోల్పోతున్న కొంతమంది సిబ్బంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి మండల పరిధిలోని స్పెషలాఫీసర్, ఎంపీడీవో, ఎంపీ ఓ, తదితర సంబందించిన అధికారులు చొరవ తీసుకుని గ్రామపంచాయతీలలో సుదీర్ఘ కాలంగా జీతాలు ఇవ్వని వారికి తక్షణమే జీతాలు చెల్లించి వారి కుటుంబాలను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ లోడే శ్రీనివాస్ డిమాండ్ చేశారు.





