- ఇంటర్మీడియట్ పరీక్షలు మొదటి రోజు సక్సెస్
- భద్రాద్రి జిల్లాలో పరీక్ష రాసేవారు
- మొదటి సంవత్సరపు విద్యార్థులు మొత్తం 10761
- హాజరైన వారు 9934.. గ్రైహాజరు అయినవారు 827
- జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి.. సులోచన రాణి
మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి మార్చి 15… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ఇలాంటి ఇబ్బందులు జరగకుండా మొదటి రోజు సక్సెస్ అయ్యింది. జిల్లాలో మొత్తం విద్యార్థులు 10761 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా వీరిలో 9934 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్షను రాశారు. 827 మంది విద్యార్థులు గ్రై హాజరు అయినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి సులోచన రాణి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబడదు అనే నిబంధన ఉండడంతో విద్యార్థులకు తల్లిదండ్రులు ఆయా పరీక్ష కేంద్రాల వద్దకు ముందస్తుగా ఎనిమిదిన్నర గంటలోపే తీసుకొచ్చారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండడంతో ఆయా పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 35 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు వచ్చే విద్యార్థుల కోసం ఆర్టీసీ తరఫున సకాలంలో చేర్చేందుకు బస్సులను ఏర్పాటు చేశారు. వేసవి కాలనీ దృష్టిలో ఉంచుకొని ప్రతి కేంద్రం వద్ద ఏఎన్ఎం నర్సులతోపాటు తాగునీటి సౌకర్యం విద్యుత్ సౌకర్యాన్ని పూర్తిస్థాయిలో కల్పించారు. పరీక్షల నిర్వహణ తీరును ఆయా ఉన్నత శాఖ అధికారులు పర్యవేక్షించారు.





