UPDATES  

 మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో కాన్షీరాం జయంతి..

మన్యం న్యూస్, ఇల్లందు టౌన్, మార్చి 15 పట్టణంలోని స్థానిక బస్ స్టాండ్ సెంటర్లో బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరామ్ 89 వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ జేఏసీ భద్రాద్రి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదూరి రవి, ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల శ్రీనివాస్ లు మాట్లాడుతూ… బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు, కోట్ల మంది భారతీయుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న బహుజన రాజ్యాధికార పితామహులు కాన్షీరామ్ అని, కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కాన్షీరామ్ విగ్రహాన్ని హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికార రుచి చూపించిన బహుజన పితామహులు కాన్షీరామ్ అని అలాంటి మహానుభావుడిని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ భద్రాద్రి జిల్లా మహిళా అధ్యక్షురాలు బొప్పి భాగ్యలక్ష్మి, బయ్యారం మండల అధ్యక్షుడు బైరాగుల వీరబాబు, ఇల్లందు పట్టణ అధ్యక్షుడు గుండేటి రాజలింగు, పోశం, స్వామి, బన్నీ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !