మన్యం న్యూస్,ఇల్లందు, మార్చి 15 ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయం ఇందిరా భవన్ నందు బుధవారం ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు చీమల వెంకటేశ్వర్లు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య హక్కులను బిజేపి,బిఆర్ఎస్ ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నారు. దేశంలో మరియు రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నాయన్నారు. ఈ బీఆర్ఎస్, భాజపా పార్టీలకు చరమగీతం పాడేందుకు, రాష్టంలో జరుగుతున్న అవినితిని ప్రజా గొంతుకగా నిగ్గదీసి అడిగేందుకు రాష్టంలో మరలా కాంగ్రెస్ పార్టికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకులు మల్లు భట్టివిక్రమార్క రాహుల్ గాంధీ ఇచ్చిన స్ఫూర్తితో హాత్ సే హాత్ జోడో పాదయాత్రకు శ్రీకారం చుట్టారని చీమల వెంకటేశ్వర్లు తెలిపారు. బోధ్ నియోజకవర్గంలో పిప్పిరి గ్రామం నుంచి ప్రారంభంకానున్న ఈ యాత్రకు రాష్టంతో పాటుగా ఇల్లందు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చీమల పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో ఇల్లందు పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు దొడ్డా డానియల్, పులి సైదులు,గార్ల మండల పార్టీ అధ్యక్షుడు ధనియాకుల రామారావు, ఇల్లందు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్టి హరిక్రిష్ణ, కాయం రమేష్ తదితరులు పాల్గొన్నారు.





