మన్యం న్యూస్,ఇల్లందు పట్టణం మార్చి 15..: ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ అండ్ ఆర్ కాలనీ పన్నెండవ వార్డు జైగణేష్ యూత్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లి పట్నాల వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పట్నాల వేడుకలు ప్రారంభమైన రెండవరోజు అయిన బుధవారంనాడు ఎల్లమ్మతల్లి ఆలయం నందు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క వేడుకలకు ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు హాజరయి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని దమ్మాలపాటి వెంకటేశ్వరరావు చేతులమీదుగా ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఒకటో వార్డు కౌన్సిలర్ వార రవి, ఏజీపీ సుధాకర్, భారాసా పట్టణ యువజన అధ్యక్షులు కార్తీక్, నాయకులు సతీష్, కమిటీ సభ్యులు రాఘవరపు రాకేష్, గొర్రె కృష్ణ, సీలివెరీ ఐలయ్య, బంటు రామూర్తి, కర్కపల్లి రాకేష్, సాయి, శ్రీను, సెంసాని సుమన్, పోతర్ల రాజు మరియు యువజన నాయకులు ఆర్కే శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.





