ప్రశాంతంగా పినపాకలో ఇంటర్ పరీక్షలు
256 మంది విద్యార్థులకు 223 మంది హాజరు
మన్యం న్యూస్, పినపాక, మార్చి 15
ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు బుధవారం రోజున ప్రారంభమయ్యాయి. పినపాక మండల పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 256 మంది విద్యార్థులకు గాను, 223 మంది విద్యార్థులు హాజరయ్యారని కళాశాల చీఫ్ సూపరిండెంట్ దేశపతి తెలియజేశారు. మొదటి సంవత్సరం పరీక్షలు రాయడానికి ఓ విద్యార్థి అనారోగ్యంతోనే హాజరు కావడంతో, ఆమెకు పోలీసు సిబ్బంది సాయం అందించి, పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లారు.





