మన్యం న్యూస్ గుండాల, మార్చి 15: మండలంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా బుధవారం ప్రారంభమయ్యాయి. గుండాల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మొత్తం 134 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 117 మంది పరీక్షకు హాజరయ్యారు 17 మంది విద్యార్థులు పరీక్షకు గైరహాజరయ్యారు. రెండో సెంటర్ అయిన తెలంగాణ గురుకుల కళాశాలలో 302 మంది విద్యార్థులకు గాను 172 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 130 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. తొలి రోజు విద్యార్థులు అందరూ సమయాన్ని కంటే గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసినాకనే పరీక్షా కేంద్రానికి అనుమతి ఇచ్చారు. గుండాల ఎస్సై కిన్నెర రాజశేఖర్ రెండు సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తును పకడ్బందీ ఏర్పాటు చేశారు





