మన్యం న్యూస్,అశ్వరావుపేట, మార్చి, 15: అశ్వారావుపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపీ నామ నాగేశ్వర రావు జన్మదిన సందర్బంగా వేడుకలను ఘనంగా నిర్వహించిన మండల నాయకులు. ఈ సందర్బంగా ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామూర్తి మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరికి ఎటువంటి సమస్య ఉందని తెలియజేసిన స్పందించే వ్యక్తి ఎంపీ నామ నాగేశ్వరరావు అని ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ మండల నాయకులతో కలిసి కేక్ కట్ చేసారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు వైస్ ఎంపీపీ చిట్టూరి ఫణీంద్ర, బిఆర్ఎస్ పార్టి మండల ఉపాధ్యక్షులు బండారు శ్రీనివాస రావు, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు నారం రాజశేఖర్, పెరయిగూడెం పార్టి ప్రెసిడెంట్ సీహెచ్ బజరయ్యా, టెలికాం అడ్వైజర్ బిర్రం వేంకటేశ్వర రావు, మండల నాయకులు మందపాటి మోహన్ రెడ్డి, తాడేపల్లి రవి, యూఎస్ ప్రకాష్ తదితర నాయుకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.





