- వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించండి
- గ్రామ స్థాయిలో ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉండాలి
- లక్ష్మీదేవి పల్లి, సుజాతనగర్ జడ్పిటిసి లకు ప్రత్యేక గదులు… నిధులు మంజూరుకు తీర్మానం
- సర్వసభ్య సమావేశంలో జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి మార్చి 15… వేసవికాలంలో ప్రజలకు తాగునీటి ఎద్దడి కలగకుండా నిరంతరాయంగా తాగునీరు అందించే విధంగా ప్రజలకు అధికారులు సహకరించాలని గ్రామస్థాయిలో ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉండి సకాలంలో వైద్యం అందించాలని జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య కోరారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో జడ్పి ఛైర్మన్ అధ్యక్షతన జడ్పి సరసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ, మిషన్ బగీరథ, విద్యాశాఖ, పోడు భూముల పట్టాలు కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా
అదికారులు ఆయా శాఖల అంశాలపై నివేదికను వినిపించారు. వైద్య ఆరోగ్యశాఖాధికారి జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాలు నిర్వహణ తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు . జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో ఎర్రగుంట, పర్ణశాల, పెనగడప,యంపి బంజర, కొమరారం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు . ప్రతిమంగళవారం మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళా ఆరోగ్య కేంద్రాలు ప్రారంభం తదుపరి రెండు మంగళవారాల్లో 443 మంది వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యపరీక్షలు నిర్వహణ నుంచి జిల్లా ఆసుపత్రికి సిఫారసు వరకు అన్ని వివరాలను పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నామని అన్నారు క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను గుర్తిస్తే హైదరాబాదులోని యంయ, నిమ్స్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు
నిర్వహణకు సిఫారసు చేస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్య మహిళా కేంద్రాలకు మంచి స్పందన వస్తున్నదని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మహిళా కేంద్రాల్లో మహిళలు వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా జడ్పిటిసిలు
వెంకటరెడ్డి, వసంత, లక్ష్మీదేవిపల్లి, చర్ల యంపిపిలు మాట్లాడుతూ మందులు, సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కంటి వెలుగు కార్యక్రమలో జిల్లాలో ఇప్పటి వరకు
2.15 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించామని, 59 వేల మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేశామని, 25 వేలమందికి ప్రిస్కిప్షన్ కంటి అద్దాలు అసరం కాగా వివరాలను పోర్టల్లో అప్లోడ్ చేయగా ఇప్పటి వరకు 10 వేల మందిపంపిణీ చేశామని, మిగిలిన 15 వేల మందికి త్వరలో కంటి అద్దాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.మిషన్ బగీరథ పథకం వివరాలను ఈఈలు నళిని, తిరుమలేష్ వివరించగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, చాలా
గ్రామాల్లో నీరు సరఫరా సక్రమంగా జరగడం లేదని, పైపులైన్లు పగిలిపోయి నీరు వృధా అవుతున్నదని జడ్పీటిసిలు,యంపిపిలు ఛైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయా శాఖల ద్వారా జరుగుతున్న పనుల వల్ల కొన్ని చోట్ల పైపులు
పగిలిపోతున్నాయని, పనులు చేపట్టు సందర్భంలో తమ దృష్టికి తీసుకొస్తే తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఈఈలు
తెలిపారు. విద్యాశాఖ కార్యకలాపాలను డిఈఓ సోమశేఖరశర్మ వివరించగా జూలూరుపాడు మండలంలో విద్యార్ధినితో ఉపాద్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడని, అతని మీద ఏం చర్యలు తీసుకున్నారని జడ్పిటిసిలు, యంపిపిలు కోరగా అతని మీద పోక్సో చట్ట ప్రకారం పోలీస్ కేసు నమోదు చేశామని, అతనిని విధులు నుంచి తొలగిస్తున్నట్లు డిఈఓ
చెప్పారు. మన ఊరు – మనబడి కార్యక్రమంలో పాఠశాలల మరమ్మత్తు పనులను వేగంగా పూర్తి చేయాలని జడ్పి ఛైర్మన్ కోరం కనకయ్య తెలిపారు. ఏప్రిల్ మాసం వరకు జిల్లాలో ఎంపిక చేసిన 368 పాఠశాలల మరమ్మత్తు పనులు పూర్తి
చేయాలని, తదుపరి రెండవ దశలో ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. పోడు పట్టాలు కార్యక్రమం గురించి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు క్లెయిమ్స్ స్వీకరించి గ్రామసభలు నిర్వహించి అర్హుల జాబితా సిద్ధం
చేస్తున్నామని, త్వరలో అర్హులకు పోడు పట్టాలు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ జడ్పిటిసిలకు ప్రత్యేక గదులు కేటాయించాలని గత సమావేశంలో తీర్మానించిన విధంగా గదుల నిర్మాణానికి నిధులు
మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం జడ్పి సిఈఓ విద్యాలత 2023-24 సంవత్సరంపు వార్షిక బడ్జెట్ 60 కోట్ల30 లక్షల 8 వేల రూపాయలతో సభలో ప్రవేశపెట్టగా సభ్యులందరూ ఏకగ్రీకంగా ఆమోదం తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పి సిఈఓ విద్యాలత, వైస్ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు,
జడ్పిటిసిలు, యంపిపిలు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.





