మన్యం న్యూస్, అశ్వారావుపేట, మార్చి 15 అశ్వారావుపేట మండలం, అచ్యుతాపురం గ్రామంలో శ్రీశ్రీశ్రీ పోలమాంబ 62వ వార్షికోత్సవ సందర్బంగా ఎమ్మెల్యే మెచ్చా స్థానిక నాయకులతో కలిసి బుధవారం శ్రీశ్రీశ్రీ పోలమాంబదేవి అమ్మ వారి తీర్థ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చాను అచ్యుతాపురం గ్రామస్థులు శాలువాతో సత్కరించారు. ఆలయానికి వచ్చే మార్గంలో వంతెన అవసరం ఉందని గ్రామస్థులు తెలియజేయడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మెచ్చా సంబంధిత అధికారులను అంచనా వేసి ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అడిగిన వెంటనే స్పందించిన మెచ్చాకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ కొనకళ్ళ రమేష్, కోళ్లు చంద్ర శేకర్, నారం రాజశేఖర్, బిర్రం వెంకటేశ్వరరావు, యస్ ప్రకాష్, డీసీసీబీ డైరెక్టర్ కన్నయ్య, ఎం మోహన్, అచ్చుతాపురం గ్రామస్థులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.





