- మణుగూరులో ప్రశాంతంగా ఇంటర్ ప్రధమ సంవత్సర పరీక్షలు…..
- – 486మంది విద్యార్థులు పరీక్షకు హాజరు.
- – 33 మంది గైర్హాజరు.
మన్యం న్యూస్, మణుగూరు, మార్చి 15: మణుగూరు మండల కేంద్రంలో బుధవారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మణుగూరులో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా ప్రధమ సంవత్సరం విద్యార్థులు 519 మంది ఉండగా 486 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 33 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 310 మంది విద్యార్థులకు 291 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 19 మంది గైరాజరయ్యారు. కృష్ణవేణి జూనియర్ కళాశాలలో 209 మంది విద్యార్థులకు గాను 195 మంది పరీక్ష హాజరుకాగా 14 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పరీక్షల నిర్వాహకులు తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ నిర్వహించారు. ఈ రెండు పరీక్ష కేంద్రాల జంబ్లింగ్ విధానం ప్రకారం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంటర్ బోర్డ్ నిబంధన ప్రకారం ఒక్క నిమిషం ఆలస్యం అయితే అనుమతి లేదని అధికారులు చెప్పడంతో విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు వచ్చారు.





