మన్యం న్యూస్, పినపాక, మార్చి 15
మండల పరిధిలోని అమరారం పంచాయితీలోని ఆదివాసి గ్రామం తిర్లాపురం లో గుర్తు తెలియని మహిళ మృత దేహం బుధవారం లభ్యం అయ్యింది. స్థానిక సీఐ బూర రాజగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం తిర్లాపురం గ్రామం చివరలో నూప రామయ్య అనే రైతుకు చెందిన వరి పొలంలో ఒక గుర్తు తెలియని మహిళ చనిపోయి కుళ్లిపోయిన స్థితి లో పడి ఉందని ఆమె వయసు సుమారు 50 నుంచి 55 సంవత్సరాలు మధ్య ఉంటుందని తెలియజేశారు. ఆమె ఒంటిపైన బూడిద రంగు దుస్తులు కలవని తెలిపారు. సుమారు మూడు నాలుగు రోజుల క్రితం చనిపోయి, కుళ్ళిన స్థితిలో ఉందని ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తించినట్లయితే
ఏడుళ్ళ బయ్యారం పోలీసు వారికి లేదా 8712682101 మొబైల్ నంబర్ కు ఫోన్ చేసి తెలియజేయాలని సీఐ రాజగోపాల్ తెలిపారు.





