మన్యం న్యూస్ గుండాల, మార్చి 15 బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్సిరాం 89వ జయంతిని మండల కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. బీఎస్పీ జిల్లా కార్యదర్శి బొమ్మెర రాంబాబు మాట్లాడుతూ బహుజనుల కోసం కాన్షిరాం ఎంతో కృషి చేశారని అన్నారు. రానున్న ఎన్నికల్లో బి.ఎస్.పి చాటుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరస్వామి, సంపత్, తుడుం దెబ్బ మండల అధ్యక్షులు నరసింహారావు, పాపయ్య, తదితరులు పాల్గొన్నారు





