మన్యం న్యూస్ ఏటూరు నాగారం, మార్చి 15
ఏటూరు నాగారం మండల కేంద్రంలో కాన్షిరాం జయంతి వేడుకలను మాల మహానాడు ములుగు జిల్లా యూత్ అధ్యక్షులు కాళ్ళ రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కన్నాయి గూడెం జడ్పిటిసి నామకరం చందు గాంధీ,ఏటూరు నాగారం పిఎసిఎస్ చైర్మన్ కునూరు అశోక్ గౌడ్,వైస్ చైర్మన్ చెన్నూరి బాలరాజు హాజరై కాన్షిరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పెండ్యాల ప్రభాకర్,బోడ సత్యం,నారా ప్రశాంత్,బోడ సారయ్య, మాదరి నరేష్,కందకట్ల శ్రీనివాస్,దాసరి కృష్ణ,గోస్కుల సమ్మయ్య,మర్రి రాజు తదితరులు పాల్గొన్నారు.





